|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 03:24 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సన్నిహిత సహాయకుడు, ప్రముఖ కన్జర్వేటివ్ నేత చార్లీ కిర్క్ హత్యకు గురైన కొద్ది రోజులకే, వామపక్ష భావజాలం కలిగిన 'యాంటిఫా' గ్రూపును ప్రధాన ఉగ్రవాద సంస్థగా అధికారికంగా ప్రకటించారు. దేశంలో పెరుగుతున్న రాజకీయ హింసకు వామపక్ష శక్తులే కారణమంటూ కొంతకాలంగా ఆరోపిస్తున్న ట్రంప్, ఈ నిర్ణయంతో తీవ్ర చర్చకు దారితీశారు.గురువారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. "యాంటిఫా అనేది ఒక ప్రమాదకరమైన, విపరీత వామపక్ష బృందం. దానిని ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తున్నాను. ఈ సంస్థకు నిధులు సమకూరుస్తున్న వారిపై ఉన్నత స్థాయి చట్టపరమైన విచారణ జరపాలని కూడా గట్టిగా సిఫారసు చేస్తాను" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.