|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 03:23 PM
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ కార్మికుల సమస్యలపై స్పందిస్తూ, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సినీ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు తమ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలపై సీఎం రేవంత్ స్పందిస్తూ, "సినీ పరిశ్రమను మెరుగైన దశకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను" అని అన్నారు.