|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 07:05 PM
హైదరాబాద్ నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మియాపూర్, మల్లాపూర్, హఫీజ్‌పేట్, సరూర్‌నగర్, కార్వాన్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో కుండపోత వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం వల్ల రోడ్లపై ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాబోయే కొద్ది గంటల్లో మరిన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.