|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 07:03 PM
గుండెపోటుతో భార్య మృతి చెందగా, ఆమె లేనిదే తాను ఎందుకు బతకాలని భావించిన భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. దిడ్డి శ్రీదేవి (53) అనే మహిళ బుధవారం గుండెపోటుతో మృతి చెందింది. దీంతో “ఇక తాను కూడా బ్రతకను” అని భావించిన మృతురాలి భర్త సుధాకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం సుదాకర్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.