|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 02:58 PM
నిరుద్యోగులు అధైర్య పడకండని, నిరసనలు ధర్నాలు సమయం వృథా చేసుకోవద్దని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సూచించారు. తమ సమస్యలను వినేందుకు అవసరమైతే తానే వ్యక్తిగతంగా అశోక్ నగర్ చౌరస్తా, సెంట్రల్ లైబ్రరీ, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాలకు వస్తానని ఆయన హామీ ఇచ్చారు.
నిరుద్యోగులను పట్టించుకోని ఏ ప్రభుత్వమూ నిలదొక్కుకోలేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. నేపాల్ తరహాలో యువత తిరగబడితే ప్రభుత్వం పడిపోవడం ఖాయమని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి.
ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేయకూడదని, వాళ్లూ మన సొంత పిల్లల్లాగే చూడాలని సూచించారు. వారికో మంచి భవిష్యత్తు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని గుర్తుచేశారు. నిరుద్యోగులకు మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
"యువత అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు" అని చెప్పిన కోమటిరెడ్డి, యువత ఆశలు నెరవేర్చే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్యల పరిష్కారానికి రాజకీయాలు కాదు, కర్తవ్య బానిసత్వం అవసరమన్నారు.