|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 08:15 PM
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలు మన సూచీలకు కొత్త జోష్ ఇచ్చాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న బలమైన అంచనాలు, భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు మళ్లీ మొదలుకావడం వంటి అంశాలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫలితంగా కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు రోజంతా లాభాల్లోనే కొనసాగాయి.ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 594.95 పాయింట్లు ఎగబాకి 82,380.69 వద్ద స్థిరపడింది. ఉదయం 81,852.11 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్, కొనుగోళ్ల మద్దతుతో ఒక దశలో 82,443.48 వద్ద గరిష్ఠ స్థాయిని కూడా తాకింది. మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 169.90 పాయింట్లు లాభపడి 25,239.10 వద్ద ముగిసింది.