|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 08:14 PM
ఫార్మాస్యూటికల్ రంగానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. కొన్ని వైద్య పరికరాలపై జీఎస్టీ రేట్లను ఇటీవల తగ్గించిన నేపథ్యంలో, మార్కెట్లో ఇప్పటికే ఉన్న మందుల ప్యాకెట్లపై కొత్త ధరల స్టిక్కర్లను తప్పనిసరిగా అంటించాలన్న నిబంధనను రద్దు చేసింది. సెప్టెంబర్ 22లోపు మార్కెట్లోకి విడుదలైన స్టాక్‌ను వెనక్కి పిలవడం లేదా రీ-లేబులింగ్ చేయడం తప్పనిసరి కాదని ఫార్మాస్యూటికల్స్ విభాగం స్పష్టం చేసింది.