|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 02:00 PM
హైదరాబాద్‌లోని మియాపూర్ డిపోలో విషాదఘటన చోటుచేసుకుంది. అక్కడ కండక్టర్‌గా పనిచేస్తున్న పండరి అనే యువకుడు మంగళవారం ఉదయం విధులకు హాజరైన కొద్దిసేపటికే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. సహచరులు వెంటనే ఆస్పత్రికి తరలించినా, ఫలితం లేకపోయింది. పొద్దున్నే సహోద్యోగులతో మాట్లాడిన పండరి కొద్ది నిమిషాలకే చనిపోవడం అందరిని షాక్‌కు గురిచేసింది. యువకుడైన పండరి ఆకస్మిక మరణంతో తోటి ఉద్యోగులు కన్నీరు పెట్టుకుంటున్నారు.