|
|
by Suryaa Desk | Tue, Jul 01, 2025, 12:41 PM
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ ప్రాజెక్టులో మంగళవారం నీటిమట్టం 20 ఫీట్లకు చేరింది. కొన్ని రోజులుగా జూరాల నుంచి కృష్ణా జలాలను కోయిల్ సాగర్ కు తరలిస్తుండడంతో ప్రాజెక్టులో నీటిమట్టం క్రమేపి పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 32. 5 ఫీట్లు. కోయిల్ సాగర్ నిండుకుండలా మారటంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు ప్రాజెక్టును చూడడానికి తరలివస్తున్నారు.