|
|
by Suryaa Desk | Tue, Jul 01, 2025, 12:46 PM
సంగారెడ్డి(D) పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ మేరకు ప్రమదస్థలాన్ని పరిశీలించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు రూ.లక్ష సాయం, గాయపడిన వారికి రూ. 50 వేలు తక్షణ సాయంగా అందిస్తామని ప్రకటించారు.సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు మంగళవారం ఉదయం పాశమైలారంలో ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. సహాయకచర్యలను స్వయంగా పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రమాదానికి కారణాలు, సహాయకచర్యల్లో పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిగాచిలో పేలుడుకు సంబంధించి డీటెయిల్డ్ రిపోర్ట్ సమర్పించాలని అధికారులను ఆదేశించారు.