|
|
by Suryaa Desk | Tue, Jul 01, 2025, 02:26 PM
TG: పాశమైలారం ఘటనలో గాయపడిన, మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మంగళవారం ఆయన ధృవ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. అనంతరం క్షతగాత్రుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాలను ఆయనే స్వయంగా నమోదు చేసుకుని ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. అయితే ఈ ఘటనలో దాదాపు 40 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.