|
|
by Suryaa Desk | Tue, Jul 01, 2025, 12:30 PM
పాశమైలారం సమీపంలోని సిగాచి ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో సంభవించిన భారీ రియాక్టర్ పేలుడుతో ఇప్పటివరకు 42 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుడు తాలుకూ తీవ్రత దృష్ట్యా ఘటనా స్థలమంతా శిధిలాలుగా మారిపోయింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిధిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. అడ్మినిస్ట్రేషన్ మరియు ప్రొడక్షన్ బిల్డింగ్స్ పూర్తిగా కూలిపోవడంతో, సహాయక బృందాలు జాగ్రత్తగా పనులు నిర్వహిస్తున్నాయి. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండగా, వారి ప్రాణాలు నిలబెట్టేందుకు వైద్యులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.
మృతుల్లో ఎక్కువ మంది తమిళనాడు, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులుగా గుర్తించబడ్డారు. ఈ ఘటనపై పరిశ్రమల భద్రతపై తీవ్ర ప్రశ్నలు ఉత్భవిస్తున్నాయి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరామర్శ ప్రకటించినప్పటికీ, బాధితుల వేదనకు ఇది చాలు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.