|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 03:06 PM
బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా జరుపుకోవాలని సీఐ రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మరికల్ పోలీస్ స్టేషన్‌లో హిందూ, ముస్లిం మత పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, పండుగ రోజున ఆవులను అక్రమంగా రవాణా చేయడం లేదా వధించడం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశువుల డాక్టర్ పరీక్షించిన జంతువులను మాత్రమే కోయాలని సూచించారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
శాంతి భద్రతల సమావేశంలో స్థానిక మత పెద్దలు పాల్గొని, పండుగను సామరస్యంతో జరుపుకునేందుకు సహకరించాలని కోరారు.