|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 06:18 PM
అమెరికాలోని న్యూ ఓర్లాన్స్ నగరంలో ఉన్న ఓ జైలు నుంచి అత్యంత చాకచక్యంగా పది మంది ఖైదీలు తప్పించుకున్న ఘటన సంచలనం సృష్టిస్తోంది. వీరిలో కొందరు హంతకులు కూడా ఉండటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. జైలులోని ఓ సెల్‌లో ఉన్న టాయిలెట్ వెనుక భాగంలో భారీ రంధ్రం చేసి, దాని ద్వారా ఖైదీలు బయటకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటన నిన్న రాత్రి సుమారు ఒంటి గంట సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే, న్యూ ఓర్లాన్స్‌లోని ఓర్లాన్స్ పారిష్ జస్టిస్ సెంటర్‌లో విచారణ ఎదుర్కొంటున్న, శిక్షలు ఖరారు కావాల్సిన ఖైదీలను ఉంచుతారు. పరారైన ఖైదీల వయసు 19 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సెల్‌లోని టాయిలెట్ వెనుక గోడకు రంధ్రం చేసిన ఖైదీలు, అక్కడి నుంచి బయటి గోడ ఎక్కి సమీపంలోని రహదారిపైకి చేరుకున్నారని సమాచారం.