|
|
by Suryaa Desk | Mon, Sep 01, 2025, 03:52 PM
పంజాబ్‌లో వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు అండగా నిలుస్తానని నటుడు సోనూ సూద్ ప్రకటించారు. “ఈ విధ్వంసకర వరదలతో ఎవ్వరూ భయపడవద్దు. ప్రతి ఒక్కరినీ తిరిగి నిలబెట్టేందుకు సహాయం చేస్తాం. అవసరమైతే సందేశం పంపండి, మేము సహాయానికి సిద్ధంగా ఉన్నాం. పంజాబ్ నా ఆత్మ.. ఎంత ఖర్చయినా వెనకడుగు వేయను. మేము పంజాబీలం.. ఎప్పుడూ లొంగిపోం” అని ఆయన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.
Latest News