|
|
by Suryaa Desk | Fri, Dec 26, 2025, 06:44 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మార్చి 2026లో విడుదల కానుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు, డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ మరో ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయి, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కన్నడ నటి రుక్మిణి వసంత్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 'సప్త సాగరాలు దాటి', 'కాంతార' సినిమాలతో రుక్మిణి మంచి పేరు తెచ్చుకున్నారు.
Latest News