|
|
by Suryaa Desk | Fri, Dec 26, 2025, 03:56 PM
ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'శంబాల' చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైంది. యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌లో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా తొలిరోజే బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో పాటు రూ.3.3 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి అదరగొట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో ఆది సాయికుమార్ పోస్టర్‌ను విడుదల చేశారు. మరిన్ని థియేటర్లలో సినిమాను ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు.
Latest News