|
|
by Suryaa Desk | Mon, Sep 01, 2025, 04:11 PM
ఏపీ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APFDC) ఛైర్మన్ గా నిర్మాత ఏఎం.రత్నం పేరును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. ఏఎం రత్నం ఎంపిక లాంఛనమే అనుకున్న సమయంలో పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎఫ్డీసీ ఛైర్మన్ పదవికి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరో పేరును ప్రాతిపాదించారని సమాచారం. అతను కూడా సమర్థుడు కావడంతో బాలయ్య ఆయన పేరును ప్రతిపాదించారని తెలుస్తోంది. దీంతో పవన్ వర్సెస్ బాలయ్య అనే చర్చ మొదలైంది.
Latest News