![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 12:57 PM
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను అమ్మేశారు. ముంబై బంద్రా వెస్ట్‌లో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ 1318 చదరపు అడుగుల విస్తీర్ణంలో, మూడు కార్ల పార్కింగ్ సదుపాయంతో ఉంది. ఈ అపార్ట్‌మెంట్‌ను ఆయన రూ. 5.35 కోట్లకు విక్రయించినట్లు రియల్ ఎస్టేట్ సంస్థ స్క్వేర్‌యార్డ్స్ తెలిపింది. ట్రాన్సాక్షన్‌ల కోసం రూ. 32.01 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించారని పేర్కొంది.
సల్మాన్ ఖాన్ నివాసం ఉండేది ఎక్కడంటే..
ఇదిలా ఉంటే, సల్మాన్ ఖాన్ మాత్రం ఇంకా తన గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ లోనే నివాసం కొనసాగిస్తున్నారు. బాంద్రాలోని ఈ అపార్ట్‌మెంట్‌లో ఆయన తన తండ్రి సలీమ్ ఖాన్, తల్లి సల్మా ఖాన్ తో కలిసి ఉంటున్నారు. ఈ ఇంటిపై గతంలో బిష్ణోయ్ గ్యాంగ్ అటాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎవరూ గాయపడలేదు. ఈ గెలాక్సీ అపార్ట్‌మెంట్ 1BHK మాత్రమే అయినప్పటికీ, సల్మాన్ తనకు అదృష్టాన్ని తీసుకువచ్చిందన్న నమ్మకంతో అక్కడే నివసిస్తున్నారు . ఇదిలా ఉండగా సల్మాన్ ఖాన్ తాజా సినిమా 'గల్వాన్' ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమా చైనాతో జరిగిన ఘర్షణ ఆధారంగా తెరకెక్కుతోంది. హీరోయిన్‌గా చిత్రాంగదా సింగ్ నటిస్తున్నారు. సినిమా సంబంధిత మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.