|
|
by Suryaa Desk | Mon, May 26, 2025, 07:58 AM
నేచురల్ స్టార్ నాని మరోసారి 'హిట్ 3' తో నటుడిగా మరియు నిర్మాత గా బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. సైలేష్ కోలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం గ్లోబల్ బాక్స్ఆఫీస్ వద్ద 100 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ని చేరుకొని ప్రాఫిట్ జోన్లోకి ప్రవేశించింది. ఈ యాక్షన్ డ్రామా చిత్రం మే 29న నెట్ఫ్లిక్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. డిజిటల్ విడుదలకు ముందు, హిట్ 4 యొక్క మేకర్స్ హిట్ ఫ్రాంచైజీ యొక్క కొత్త విడతలో కార్తీ యొక్క ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. కార్తీ హిట్ 4లో ఎసిపి వీరప్పన్ పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. వాల్ పోస్టర్ సినిమా మరియు యూనానిమ్స్ ప్రొడక్షన్స్ కింద ప్రశాంతి టిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
Latest News