|
|
by Suryaa Desk | Tue, May 13, 2025, 07:41 PM
హాలీవుడ్‌లో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సిరీస్ ‘ఫైనల్ డెస్టినేషన్’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఫ్రాంచైజీలో ‘బ్లడ్ లైన్స్’ అనే 6వ భాగాన్ని తెరకెక్కించారు. మే 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రం, ఇండియాలో మే 15న థియేటర్లలోకి వస్తోంది. గత 14 సంవత్సరాల తర్వాత కొత్త ఎపిసోడ్ రాబోతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచింది.2000లో తొలి పార్ట్ రాగా.. 2003, 2006, 2009, 2011లో మిగతా పార్ట్స్ వచ్చాయి. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఆరోది రిలీజ్ అవుతోంది. ఇదే చివరిది కూడా.కొన్నాళ్ల క్రితమే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అది కూడా భయపెట్టేసింది. ఇంటి పెరటిలో ఓ ఫ్యామిలీ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అయితే వాళ్లని చావు వెంటాడుతుంది. బీర్ గ్లాస్ ముక్క, వాక్యూమ్ క్లీనర్.. ఇలా అక్కడున్న ప్రతి వస్తువు వీళ్ల చావుకు కారణమయ్యేలా ఉంటుంది. మరి చావు నుంచి తప్పించుకున్నారా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.
Latest News