|
|
by Suryaa Desk | Tue, Oct 10, 2023, 08:31 AM
సుధీర్ బాబు కథానాయకుడిగా హర్ష వర్ధన్ దర్శకత్వంలో 'మామా మశ్చీంద్ర' విడుదలైంది. ఇందులో సుధీర్ బాబు మూడు పాత్రల్లో కనపడతాడు, అయితే ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా వున్నా, సినిమా విడుదలైన తరువాత మొదటి రోజు మొదటి షో నుండే ఈ సినిమాలో విషయం లేదు, దమ్ము లేదు అని తేలిపోయింది. విడుదలైన రోజే ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు రాక కొన్ని థియేటర్స్ బోసిపోయాయి అని తెలిసింది. ఇందులో ఈషా రెబ్బ, మృణాళిని రవి కథానాయికలు. హిట్ కోసం పరితపిస్తున్న సుధీర్ బాబు ఈ సినిమాతో ఇంకో ఫ్లాపు చూసాడు.
Latest News