‘అరి’ వంటి సినిమాలో నటించడం గర్వంగా ఉంది - సాయికుమార్
 

by Suryaa Desk | Fri, Oct 10, 2025, 03:04 PM

ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ( ఆర్ వీ రెడ్డి ) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘అరి’. లింగ గుణపనేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. "పేపర్ బాయ్" చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘అరి’ సినిమా ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. బుధవారం రాత్రి హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ పలువురు రాష్ట్ర మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు అతిథులుగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో


నిర్మాత తిమ్మప్ప నాయుడు పురిమెట్ల మాట్లాడుతూ - అరిషడ్వర్గాల నేపథ్యంగా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి మా దర్శకుడు జయశంకర్ ‘అరి’ సినిమాను రూపొందించాడు. కథ విన్నప్పుడే ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం కలిగింది. ఈ సినిమా కాన్సెప్ట్ ను ఎంతోమంది పెద్దవాళ్లు ప్రశంసిస్తున్నారు. మూవీకి థియేటర్స్ లో మంచి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నా. అన్నారు.


ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ - ‘అరి’ లాంటి చిత్రాన్ని మనమంతా సపోర్ట్ చేయాలి. మంచి కాన్సెప్ట్ తో దర్శకుడు జయశంకర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ఈవెంట్ కు వెంకయ్యనాయుడు, చినజీయర్ స్వామి లాంటి పెద్దలు వస్తే ఇంకా బాగుండేది. నేను హీరోగా నటించిన ఇండియన్ ఫైల్స్ అనే సినిమాను మన భారత చరిత్ర ఆధారంగా తెరకెక్కించాం. ప్రేక్షకులు ‘అరి’ సినిమాను ఆదరించి వారి ప్రయత్నాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.


శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి మాట్లాడుతూ - అరిషడ్వర్గాల వల్ల కలిగే ఉద్రేకాల వల్లే మనిషి చెడిపోతాడు. అలాంటి అరిషడ్వర్గాల ఆధారంగా జయశంకర్ సినిమా రూపొందించడం అభినందనీయం. ఇది సమాజానికి మంచి చేస్తుంది కాబట్టే సినిమా కార్యక్రమానికి వచ్చాం. అరి సినిమా చూడండి ఆ హరికి దగ్గరవ్వండి. అన్నారు.


ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ - మనమంతా మనుషులం కాబట్టి అరిషడ్వర్గాలు ఉంటాయి. వాటిని పూర్తిగా వదిలేయడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ వీలైనంత తగ్గించుకుంటే మంచిది. మన సమాజం చేయాల్సిన అలాంటి ప్రయత్నానికి ఈ ‘అరి’ సినిమా తోడ్పడాలని కోరుకుంటున్నా. అలాగే ఇలాంటి మంచి చిత్రాలను ప్రోత్సహిస్తే ఈ కోవలో మరిన్ని మూవీస్ చేస్తారు. కొత్త టాలెంట్ ఇండస్ట్రీకి వచ్చి నిలదొక్కుకునే అవకాశం ఏర్పడుతుంది. అన్నారు.


ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ - మంచి సందేశం ఇచ్చేలా రూపొందిన ‘అరి’ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా. అలాగే ఈ చిత్ర దర్శక నిర్మాతలకు మంచి పేరు గుర్తింపు ఈ సినిమా తీసుకొస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.


తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ - ‘అరి’ లాంటి సినిమాలు మన సమాజానికి అవసరం. పెడదారి పడుతున్న యువతను ఇలాంటి మూవీస్ మంచి మార్గంలో వెళ్లేలా చేస్తాయి. సందేశాత్మక చిత్రాల ద్వారానే మన ప్రేక్షకులకు మంచిని చెప్పడం సాధ్యమవుతుంది. అన్నారు.


 


మినిస్టర్ జి. వివేక్ మాట్లాడుతూ - డైరెక్టర్ జయశంకర్ మా పెద్దపల్లి నియోజకవర్గానికి చెందినవారు. ఆయన గతంలో పేపర్ బాయ్ అనే సినిమా చేశారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు అరిషడ్వర్గాల ఆధారంగా ‘అరి’ అనే చిత్రాన్ని రూపొందించారు. ఇది కొత్త కాన్సెప్ట్. ఈ చిత్రంలో నటించిన సాయికుమార్ గారు నాకు మంచి మిత్రులు. మనందరిలో అరిషడ్వర్గాలు ఉంటాయి. అయితే వాటిని సాధ్యమైనంత నియంత్రించుకోవాలి. సినిమా బిజినెస్ అంటేనే రిస్క్. ‘అరి’ చిత్రంతో అలాంటి రిస్క్ చేశారు నిర్మాతలు. వారికి ఈ సినిమా మంచి విజయాన్ని ఇవ్వాలి. తగినన్ని ప్రోత్సహాకాలు ఇస్తూ మన చిత్ర పరిశ్రమను కూడా కాపాడుకోవాలి, అభివృద్ధి చెందేలా చూసుకోవాలి. అప్పుడే స్థానికంగా ఉన్న ప్రతిభావంతులకు అవకాశాలు వస్తాయి. అన్నారు.


 


నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ - అరిషడ్వర్గాల ఆధారంగా దర్శకుడు జయశంకర్ ‘అరి’ సినిమాను రూపొందించారు. ఎలా చెబితే యూత్ కు సందేశం చేరుతుందో అలా ఈ సినిమాను తెరకెక్కించారు. యూఎస్ లో ఉండే ప్రొడ్యూసర్స్ రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు సినిమా మీద ప్యాషన్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ టీమ్ అందరికీ ‘అరి’ సినిమా పెద్ద విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.


 


నిర్మాత దామోదరప్రసాద్ మాట్లాడుతూ - ‘అరి’ సినిమా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా రూపొందించారు కాబట్టి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా.ఇప్పుడు పర్పెక్ట్ రిలీజ్ కు వస్తోంది. కంటెంట్ బాగున్న ప్రతి సినిమా ఆదరణ పొందుతుంది. అలాగే ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నా. అన్నారు.


 


యాక్టర్ వినోద్ వర్మ మాట్లాడుతూ - దర్శకుడు జయశంకర్, నేను గతంలో ఓ షార్ట్ ఫిలిం చేశాం. దానికి మంచి పేరొచ్చింది. ‘అరి’ సినిమాలో కీ రోల్ చేయాలని నన్ను పిలిచాడు. ఈ మూవీలో ఎప్పుడూ ఫ్రెష్ గా కనిపించాలని అన్నాడు. అలాగే మూడు పేజీల డైలాగ్స్ కూడా చెప్పాను. సాయి కుమార్ లాంటి యాక్టర్ తో వర్క్ చేసినప్పుడు మాత్రం భయమేసింది. మనలోని భావోద్వేగాలను నియంత్రించుకోవాలనే మంచి కాన్సెప్ట్ ను ఎంటర్ టైనింగ్ రూపొందించాడు జయశంకర్. మంచి కంటెంట్ ను ప్రేక్షకులు ఆదరిస్తారు. ‘అరి’ సినిమాను కూడా మీరు సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాం. అన్నారు.


 


నిర్మాత శ్రీనివాస్ రామిరెడ్డి మాట్లాడుతూ - మనిషి ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనే పాయింట్ తో దర్శకుడు జయశంకర్ ‘అరి’ సినిమాను రూపొందించారు. మాకు సింగిల్ లైన్ లో ఆయన చెప్పిన కథ నచ్చి ఈ మూవీని నిర్మించాం. మనలోనే అరిషడ్వర్గాలు అనే శత్రువులు ఉంటాయి. వాటిని జయించినప్పుడే గొప్ప స్థాయికి వెళ్తాం. ‘అరి’ సినిమా నిర్మాణంలో భాగమైన నా తోటి నిర్మాతలకు థ్యాంక్స్. మా మూవీని తెలుగు ఆడియెన్స్ ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.


 


నటి అనసూయ మాట్లాడుతూ - ‘అరి’ సినిమాకు వర్క్ చేయడం మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. ఆంథాలజీ తరహాలో సాగే చిత్రమిది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కీలకంగా ఉంటుంది. ఆ పాత్ర ఎలా ఉంటుంది అనేది స్క్రీన్ మీద చూడాలి. మంచి సందేశం, ఎంటర్ టైన్ మెంట్ ఉన్న ‘అరి’ చిత్రాన్ని మీరు చూసి సక్సెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. అన్నారు.


 


మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ - డైరెక్టర్ జయశంకర్ ‘అరి’ సినిమా కాన్సెప్ట్ చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు కూడా ఎంజాయ్ చేశాం. ఈ మూవీలో ఆరుగురు మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు. వారిలో సాయి కుమార్ గారు ఒక క్యారెక్టర్ చేయడం హ్యాపీగా ఉంది. ‘అరి’ లాంటి మూవీ చేయడం సులువు కాదు. నిర్మాతలకు నా అభినందనలు చెబుతున్నా. మనలోని వీక్ నెస్ లను ఓవర్ కమ్ చేయాలని చెప్పే మంచి చిత్రమిది. ఈ సినిమాను ప్రేక్షకులు మిస్ కాకూడదు అని కోరుకుంటున్నా. అన్నారు.


 


డైరెక్టర్ జయశంకర్ మాట్లాడుతూ - ‘అరి’ సినిమా మనల్ని మనం చూసుకునే అద్దం లాంటిది. అరిషడ్వర్గాల కాన్సెప్ట్ ను ఎంతోమంది సద్గురులను కలిసి ఒక ఎంటర్ టైనింగ్ గా ఈ చిత్రంలో రూపొందించాను. ఈ సినిమా చూసి బయటకు వచ్చాక, ఆ పాత్ర నేనే కదా అనే ఫీల్ కలుగుతుంది. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు. మా ప్రొడ్యూసర్ ఆర్వీ రెడ్డి గారు లేకుంటే అరి సినిమా లేదు. నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్ట్ తో ఆయన ట్రావెల్ అవుతూ మమ్మల్ని నడిపిస్తున్నారంటే ఆయనకు సినిమా మీదున్న ప్యాషన్ ను అర్థం చేసుకోవచ్చు. అరి సినిమా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తిమ్మప్ప నాయుడు గారు వచ్చి ఆదుకున్నారు. మా చిత్రంలోని ఆరు పాత్రల్లో ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంది సాయికుమార్ గారిని. ఆయన పర్ ఫార్మెన్స్ అద్భుతంగా చేశారు. అలాగే నా స్నేహితుడు వినోద్ వర్మకు ఈ చిత్రంతో మంచి పేరొస్తుంది. అన్నారు.


 


యాక్టర్ సాయికుమార్ మాట్లాడుతూ - పురాణ ఇతిహాసాల గురించి చిన్నప్పుడు అమ్మ నాకు చెప్పేది. జయశంకర్ అరిషడ్వర్గాల నేపథ్యంగా సినిమా అని చెప్పిప్పుడు కొత్తగా అనిపించింది. ఆరు పాత్రలతో జయశంకర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. మా ఆరు పాత్రలు ఎక్కడా కలవవు. అందుకే మీతో పాటు నేను కూడా థియేటర్ లో ఈ సినిమా ఎలా వచ్చిందో చూడాలని అనుకుంటున్నా. నా 50 ఏళ్ల నట జీవితంలో అరి లాంటి చిత్రంలో నటించినందుకు గర్వపడుతున్నా. ఈ సినిమాకు కనిపించే మూడు సింహాల్లాంటి ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఉన్నారు. కనిపించని నాలుగో సింహం లాంటి ప్రొడ్యూసర్ మా ఆర్వీ రెడ్డి గారు అమెరికాలో ఉంటారు. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరూ బాగా నటించారు. వినోద్ వర్మ నటన ఆకట్టుకుంటుంది. అనూప్ మ్యూజిక్ బాగుంది. ఇతర క్రూ అంతా కష్టపడి పనిచేశారు. ఈ మధ్య గంగాధర శాస్త్రి గారి భగవద్గీతకు వచనం చెప్పాను. జేడీ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో చేస్తున్న ప్రాజెక్ట్ కు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన 108 శ్లోకాలకు తెలుగు వెర్షన్ చెప్పాను. అలాగే జీఎంఆర్ వాళ్లు భగవద్గీతను తెలుగులోకి తీసుకొస్తూ నన్నే వాయిస్ చెప్పమన్నారు. అలా ఈ మధ్య నాపై శ్రీకృష్ణుడు దయ చూపిస్తున్నాడు. మనం ఆధునికంగా ఎంత ఎదిగినా మన నాగరికత మర్చిపోకూడదు. ఒక మంచి సందేశాన్ని సినిమా అనే పవర్ ఫుల్ మీడియా ద్వారా చెబుతున్నాం. పెద్దలంతా మా మూవీని ఆశీర్వదించారు. వెంకయ్య నాయుడు గారు మోడరన్ భగవద్గీత అన్నారు. ఇలాంటి గొప్ప సినిమాను మీరంతా థియేటర్స్ లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

Latest News
నేటి అర్ధరాత్రి నుంచి ఓటీటీలో ‘బాహుబలి ది ఎపిక్’ స్ట్రీమింగ్ Wed, Dec 24, 2025, 07:38 PM
శివాజీ వ్యాఖ్యలు.. నిధి అగర్వాల్‌ పోస్ట్‌ Wed, Dec 24, 2025, 07:37 PM
ఫిబ్రవరిలో పూరి జగన్నాథ్ 'బెగ్గర్' టీజర్ విడుదల! Wed, Dec 24, 2025, 04:22 PM
నేను ఎవరికీ భయపడను: నటుడు శివాజీ Wed, Dec 24, 2025, 04:19 PM
ఓటీటీలో దూసుకుపోతున్న సంతాన ప్రాప్తిరస్తు Wed, Dec 24, 2025, 03:18 PM
నటుడు శివాజీకి కరాటే కల్యాణి మద్దతు Wed, Dec 24, 2025, 03:01 PM
రూ. 2. 5 కోట్లతో రూ.35 కోట్లు వసూలు చేసిన 'లిటిల్ హార్ట్స్' మూవీ Wed, Dec 24, 2025, 03:00 PM
‘దండోరా’కు యూ/ఏ సర్టిఫికెట్ Wed, Dec 24, 2025, 02:55 PM
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న 'బాహుబలి: ది ఎపిక్' మూవీ Wed, Dec 24, 2025, 12:58 PM
అన్యాయానికి ఎదురు నిలిచే గిరిజన యువతిగా రష్మిక మందన్న! Wed, Dec 24, 2025, 12:16 PM
జ్యోతిష్యుడు వేణుస్వామి వ్యాఖ్యలపై నటి ప్రగతి ఘాటు స్పందన Wed, Dec 24, 2025, 11:47 AM
మహేష్ బాబు ఫ్యామిలితో సరదాగా గడిపిన క్షణాలు వైరల్ Wed, Dec 24, 2025, 11:44 AM
“శివాజీ ‘బూతు’ వ్యాఖ్యలపై కమల్ కామరాజు సంచలన కౌంటర్: దరిద్రం చూసే కళ్లలోనే ఉంది!” Tue, Dec 23, 2025, 09:52 PM
రాజా సాబ్ సెన్సార్ రివ్యూ ఫలితాలు వచ్చేసాయి – ప్రభాస్ అభిమానులకు లేట్ అప్‌డేట్! Tue, Dec 23, 2025, 08:56 PM
నటుడు శివాజీకి ఆర్జీవీ స్ట్రాంగ్ కౌంటర్ Tue, Dec 23, 2025, 07:56 PM
బరువు పెరిగినందుకు పెద్ద సినిమా కోల్పోయిన రాధికా ఆప్టే Tue, Dec 23, 2025, 07:54 PM
శివ సినిమాతో 'ఓం' స్క్రిప్ట్ మార్చిన ఉపేంద్ర Tue, Dec 23, 2025, 03:28 PM
శివాజీ వ్యాఖ్యలపై మంచు మనోజ్ సంచలన లేఖ Tue, Dec 23, 2025, 03:27 PM
అఖండ -2.. ఇప్పటివరకు ఎన్ని రూ.కోట్లు వసూళ్లు చేసిందంటే? Tue, Dec 23, 2025, 03:26 PM
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఖరారు Tue, Dec 23, 2025, 03:24 PM
రెండో కుమార్తె వివాహ విషయాలని పంచుకున్న జగపతిబాబు Tue, Dec 23, 2025, 03:03 PM
శివాజీ వ్యాఖ్యలపై స్పందించిన చిన్మయి Tue, Dec 23, 2025, 02:58 PM
నయనం వెబ్ సిరీస్ కథ ఏంటో చూద్దాం రండి Tue, Dec 23, 2025, 02:54 PM
మహిళలకి వేషధారణతోనే గౌరవం లభిస్తుంది Tue, Dec 23, 2025, 02:50 PM
'రౌడీ జనార్ధన్' గ్లింప్స్‌ విడుదల Tue, Dec 23, 2025, 02:40 PM
క్రిస్మస్‌ బరిలో నిలవనున్న ‘వృషభ’ Tue, Dec 23, 2025, 02:38 PM
హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు, అనసూయ కౌంటర్ Tue, Dec 23, 2025, 02:01 PM
బెట్టింగ్ యాప్స్ కేసు: సీఐడీ విచారణకు మంచు లక్ష్మి హాజరు Tue, Dec 23, 2025, 01:43 PM
విషాదం.. ప్రముఖ నటుడు జేమ్స్ రాన్సోన్ ఆత్మహత్య Tue, Dec 23, 2025, 12:33 PM
ప్రమోషన్ కాదు, కంటెంటే ముఖ్యం: అనిల్ రావిపూడి Tue, Dec 23, 2025, 12:15 PM
బంగ్లాదేశ్ హింసపై కాజల్ ఘాటు పోస్ట్! Tue, Dec 23, 2025, 11:10 AM
శోభన్ బాబు ఆస్తుల రహస్యంమిదే Tue, Dec 23, 2025, 11:07 AM
నాని సినిమాకు నో చెప్పిన జాన్వీ కపూర్! Tue, Dec 23, 2025, 10:31 AM
వృషభ డబ్బింగ్ సినిమా కాదు, పాన్ ఇండియా చిత్రం: బన్నీ వాస్ Tue, Dec 23, 2025, 10:27 AM
కొవిడ్ తర్వాత కెరీర్ మారింది: ఆది సాయికుమార్ Tue, Dec 23, 2025, 10:25 AM
ప్రభాస్ 'రాజా సాబ్' ప్రమోషన్స్ పై కీలక నిర్ణయం! Mon, Dec 22, 2025, 03:53 PM
16 ఏళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్ లోని షాట్.. నేడు పవన్ కళ్యాణ్ తో: సుజీత్ Mon, Dec 22, 2025, 03:51 PM
దుల్కర్ సల్మాన్‌తో పూజా హెగ్డే కొత్త సినిమా Mon, Dec 22, 2025, 03:50 PM
బిగ్‌బాస్ 9: తనుజ రెమ్యునరేషన్ ఎంతంటే? Mon, Dec 22, 2025, 02:21 PM
కూలీ: 'ఏ' సర్టిఫికెట్ తో 500 కోట్ల వసూళ్లు.. ఎలా సాధ్యమైంది? Mon, Dec 22, 2025, 02:20 PM
వచ్చే ఏడాది జనవరి 9న ఓటీటీలోకి రాబోతున్న అఖండ 2! Mon, Dec 22, 2025, 02:19 PM
బిగ్‌బాస్ ట్రోఫీని మహిళలు ఎందుకు గెలవలేకపోతున్నారు? Mon, Dec 22, 2025, 02:05 PM
తండ్రి కాబోతున్న నాగచైతన్య.. నాగార్జున క్లారిటీ Mon, Dec 22, 2025, 02:04 PM
'ధురంధర్' చిత్రంపై ప్రశంసలు కురిపించిన రామ్ గోపాల్ వర్మ Mon, Dec 22, 2025, 01:43 PM
స‌మంత‌కూ అభిమానుల తాకిడితో చేదు అనుభవం Mon, Dec 22, 2025, 01:27 PM
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9 విజేతగా కల్యాణ్ పడాల Mon, Dec 22, 2025, 01:23 PM
ద్రౌపది ముర్ముతో హాస్యన‌టుడు బ్రహ్మానందం భేటీ Mon, Dec 22, 2025, 01:16 PM
‘ధురంధర్’ చిత్రంలో అందుకే తమన్నా ని తీసుకోలేదు Mon, Dec 22, 2025, 01:12 PM
ఛాంపియన్' సినిమా విశేషాలు పంచుకున్న హీరో రోషన్ Sun, Dec 21, 2025, 03:14 PM
సోషల్ మీడియా స్టార్ మోనాలిసా హైదరాబాద్‌లో కిచెన్ ప్రారంభం Sun, Dec 21, 2025, 03:13 PM
భర్త మహాశయులకు విజ్ఞప్తి: టికెట్ ధరల పెంపు ఉండదు Sun, Dec 21, 2025, 03:10 PM
దర్శకురాలిగా మారిన కేట్ విన్‌స్లెట్ Sun, Dec 21, 2025, 02:59 PM
డిసెంబర్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ Sun, Dec 21, 2025, 02:58 PM
రింగుల జుట్టుతో అవమానాలు.. తాప్సీ సంచలన వ్యాఖ్యలు Sun, Dec 21, 2025, 02:51 PM
'హ్యాపీ రాజ్' చిత్రంతో మరోసారి వెండితెరపైకి అబ్బాస్ Sun, Dec 21, 2025, 02:15 PM
మోదీ జీవితం ఆధారంగా బయోపిక్ Sun, Dec 21, 2025, 02:13 PM
నేను వాస్తవానికి క్రికెటర్‌గా స్థిరపడాలనుకున్నాను Sun, Dec 21, 2025, 02:11 PM
రోడ్డు ప్రమాదానికి గురైన నోరా ఫతేహి కార్ Sun, Dec 21, 2025, 02:10 PM
అక్షయ్ ఖన్నాపై మాధవన్ ప్రశంసల వర్షం Sat, Dec 20, 2025, 03:39 PM
నాని 'ద ప్యారడైజ్'లో సంపూర్ణేశ్ బాబు మాస్ లుక్ రిలీజ్ Sat, Dec 20, 2025, 03:36 PM
‘మన్మథుడు’కి 23 ఏళ్లు పూర్తి.. స్పెషల్ వీడియో Sat, Dec 20, 2025, 03:29 PM
సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్ Sat, Dec 20, 2025, 03:28 PM
ప్రస్తుతానికి దర్శకత్వం చెయ్యడానికి నేను సిద్ధంగా లేను Sat, Dec 20, 2025, 03:22 PM
'దండోరా' ట్రైలర్‌ విడుదల Sat, Dec 20, 2025, 03:15 PM
ప్రముఖ మలయాళ నటుడు శ్రీనివాసన్ కన్నుమూత Sat, Dec 20, 2025, 03:13 PM
పదవిని అడ్డుపెట్టుకొని తన భర్తని కాపాడుకోవాలని చూస్తుంది Sat, Dec 20, 2025, 03:10 PM
దర్శకుడు కబీర్ ఖాన్‌కు కశ్మీర్ పర్యటనలో ఎదురైన మధురమైన అనుభవం Sat, Dec 20, 2025, 03:01 PM
'గుర్రం పాపిరెడ్డి' కథ ఏంటో చూద్దాం రండి Sat, Dec 20, 2025, 02:41 PM
'ది ప్యారడైజ్' చిత్రంలో సంపూర్ణేశ్ బాబు Sat, Dec 20, 2025, 02:39 PM
"సోగ్గాడు" చిత్రానికి 50 ఏళ్లు Sat, Dec 20, 2025, 02:37 PM
ప్రభాస్ 'రాజాసాబ్' నుంచి మరో ట్రైలర్? Sat, Dec 20, 2025, 12:47 PM
రెండవ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న మంచు మనోజ్ Sat, Dec 20, 2025, 11:33 AM
రివ్యూలే ఊపిరి పోశాయి: కళ్యాణి ప్రియదర్శన్ Sat, Dec 20, 2025, 10:41 AM
జానీ మాస్టర్ కేసులో షాకింగ్ ట్విస్ట్ Sat, Dec 20, 2025, 10:35 AM
రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ విడుదల Fri, Dec 19, 2025, 07:20 PM
అఖిల్ సరసన అనన్య పాండే ? Fri, Dec 19, 2025, 03:54 PM
ఓటీటీలో అలరిస్తున్న కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌లు Fri, Dec 19, 2025, 03:49 PM
ప్రభాస్ ప్రైవేట్ జెట్ ప్రయాణం: కారణాలు ఇవేనట! Fri, Dec 19, 2025, 03:48 PM
ధురంధర్‌పై రామ్‌గోపాల్‌ వర్మ ప్రశంసలు Fri, Dec 19, 2025, 03:17 PM
ఓటీటీలోకి వచ్చేసిన ‘రాజు వెడ్స్ రాంబాయి’.. ఎక్కడంటే? Fri, Dec 19, 2025, 02:49 PM
తెలుగులో 'బాహుబలి' లాంటి సినిమా చేయాలి: రకుల్ ప్రీత్ సింగ్ Fri, Dec 19, 2025, 02:19 PM
Missterious Movie Review : మిస్టీరియస్.. థ్రిల్లర్ మాత్రమే కాదు హర్రర్ కూడా Fri, Dec 19, 2025, 02:09 PM
వరుణ్ సందేశ్ 'నయనం' వెబ్‌సిరీస్.. హత్య మిస్టరీతో సైన్స్ ఫిక్షన్ Fri, Dec 19, 2025, 01:48 PM
అల్లు అర్జున్‌తో నటించాలని ఉంది: కృతి సనన్ Fri, Dec 19, 2025, 01:47 PM
నిధి అగర్వాల్ కు చేదు అనుభవం, కాస్టింగ్ కౌచ్ పై పాత కామెంట్స్ వైరల్ Fri, Dec 19, 2025, 01:44 PM
రామ్ చరణ్ 'పెద్ది' మార్చి 27కే విడుదల Fri, Dec 19, 2025, 11:10 AM
2025లో 500 కోట్ల వసూలు దాటిన సినిమాలివే Fri, Dec 19, 2025, 11:09 AM
'పుష్ప 3' కంటే ముందే బన్నీ-సుకుమార్ కొత్త సినిమా! Fri, Dec 19, 2025, 10:41 AM
నేడు విడుదల కానున్న ‘గుర్రం పాపిరెడ్డి’ చిత్రం Fri, Dec 19, 2025, 08:57 AM
ఇకపై 'టెర్మినేటర్' చిత్రంలో ఆర్నాల్డ్ కనిపించరు Fri, Dec 19, 2025, 08:55 AM
ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'రాజు వెడ్స్ రాంబాయి' Fri, Dec 19, 2025, 08:53 AM
నాలుగు విభిన్న గెటప్స్‌లో 'గుర్రం పాపిరెడ్డి' లో నటించిన నరేష్ ఆగస్త్య Fri, Dec 19, 2025, 08:52 AM
లెవన్‌ సినిమాపై నవీన్‌ చంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు Thu, Dec 18, 2025, 08:04 PM
విడాకులు తీసుకున్న నటుడు షిజు ఏఆర్ Thu, Dec 18, 2025, 07:50 PM
చిత్రంలో వైష్ణవి కొక్కుర ఫస్ట్ లుక్ విడుదల Thu, Dec 18, 2025, 07:48 PM
డార్క్ కామెడీ మూవీగా "గుర్రం పాపిరెడ్డి" - ఫరియా అబ్దుల్లా Thu, Dec 18, 2025, 07:40 PM
షూటింగ్‌లో ప్రమాదం.. హీరో ఆదికి గాయాలు? Thu, Dec 18, 2025, 03:44 PM
‘ఐబొమ్మ’ రవిని 12 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చిన నాంపల్లి కోర్టు Thu, Dec 18, 2025, 03:06 PM
రోజురోజుకి ‘ధురంధర్’ చిత్రానికి పెరిగిపోతున్న ఆదరణ Thu, Dec 18, 2025, 03:05 PM
రవితేజ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వనున్న చిరంజీవి Thu, Dec 18, 2025, 03:04 PM
'ఆహా' స్ట్రీమింగ్ అవుతున్న 'ధూల్ పేట్ పోలీస్ స్టేషన్' వెబ్ సిరీస్ Thu, Dec 18, 2025, 03:02 PM
రెండో పెళ్లిపై తన అభిప్రాయాన్ని తెలిపిన ప్రగతి Thu, Dec 18, 2025, 03:00 PM
నా అనుమతి లేకుండా నా ఫొటోను ఏఐతో మార్చి సర్క్యులేట్ చెయ్యడం దారుణం Thu, Dec 18, 2025, 02:59 PM
'డేవిడ్ రెడ్డి'లో నటించే అతిధి పాత్రలపై స్పందించిన మనోజ్ Thu, Dec 18, 2025, 02:55 PM
'ది రాజా సాబ్' సినిమా ఈవెంట్‌లో అభిమానుల తాకిడితో ఆందోళనకి గురైన నిధి అగర్వాల్‌ Thu, Dec 18, 2025, 02:52 PM
డిసెంబర్ 19నుండి ఓటీటీలో అందుబాటులోకి 'సంతాన ప్రాప్తిరస్తు' Thu, Dec 18, 2025, 02:51 PM
థియేటర్లలో దోపిడీ: ప్రేక్షకులు ఓటీటీల వైపు - నటుడు శివాజీ విమర్శ Thu, Dec 18, 2025, 02:18 PM
మాస్టర్ మహేంద్రన్ 'నీలకంఠ'తో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ! Thu, Dec 18, 2025, 02:13 PM
జనవరి 8న ‘ది రాజా సాబ్‌’ ప్రీమియర్స్‌ Thu, Dec 18, 2025, 02:09 PM
పేరెంట్స్ కాబోతున్న నాగచైతన్య-శోభిత? Thu, Dec 18, 2025, 02:06 PM
లూలూ మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం, 'మృగాలు' అంటూ చిన్మయి ఫైర్! Thu, Dec 18, 2025, 02:05 PM
సంతాన ప్రాప్తిరస్తు: థియేటర్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలో సందడి Thu, Dec 18, 2025, 01:58 PM
'ఆదిత్యం' షార్ట్ ఫిల్మ్‌కు 18 అంతర్జాతీయ అవార్డులు Wed, Dec 17, 2025, 08:41 PM
60 ప్లస్ హీరోలకు కుర్ర హీరోయిన్లే దిక్కు! Wed, Dec 17, 2025, 08:38 PM
‘ఏఐ’ ఫొటోలకు ఎవరూ సపోర్ట్‌ చేయొద్దు: శ్రీలీల Wed, Dec 17, 2025, 08:37 PM
రెస్టారెంట్‌పై పోలీసు కేసు.. హైకోర్టును ఆశ్రయించిన నటి Wed, Dec 17, 2025, 08:36 PM
గుడివాడ ఏఎన్నార్‌ కళాశాలకు రూ.2 కోట్లు విరాళం ప్రకటించిన నాగార్జున Wed, Dec 17, 2025, 04:23 PM
'ఆహా'లో ఈ నెల19న స్ట్రీమింగ్ కానున్న 'మఫ్టీ పోలీస్' Wed, Dec 17, 2025, 04:17 PM
‘అవతార్ 3’ అద్బుతమన్న రాజమౌళి Wed, Dec 17, 2025, 04:16 PM
‘కేడి’ చిత్ర దర్శకుడు హఠాన్మరణం Wed, Dec 17, 2025, 04:13 PM
500 రొమ్ము క్యాన్సర్ చికిత్సలు చేపించిన సోనూ సూద్ Wed, Dec 17, 2025, 04:11 PM
గత 15 ఏళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాను Wed, Dec 17, 2025, 04:09 PM
ఆస్కార్ రేసులో నిలిచిన 'హోమ్‌బౌండ్' చిత్రం Wed, Dec 17, 2025, 04:08 PM
‘ధురంధర్’ చిత్రంపై ప్రశంసలు కురిపించిన ప్రీతి జింటా Wed, Dec 17, 2025, 04:04 PM
కుంభమేళాకు వెళ్లాలనిఉంది Wed, Dec 17, 2025, 04:02 PM
మరోసారి పాట పాడనున్న బాలకృష్ణ Wed, Dec 17, 2025, 04:00 PM
వారణాసి మూవీపై కామెరూన్ ఆసక్తి, షూటింగ్ అప్‌డేట్ Wed, Dec 17, 2025, 03:23 PM
నటి నగ్మా: 50 ఏళ్ల వయసులోనూ ఒంటరి, రాజకీయాల్లో చురుకుగా Wed, Dec 17, 2025, 03:20 PM
బాలీవుడ్‌లో తమన్నా భాటియా మరో క్రేజీ ప్రాజెక్ట్ Wed, Dec 17, 2025, 03:04 PM
అఖండ 3 అవెంజర్స్ స్థాయిలోనే ఉంటుంది: బోయపాటి శ్రీను Wed, Dec 17, 2025, 02:53 PM
అల్లు అర్జున్, అట్లీ సినిమా.. రీషూట్ కి సిద్ధమైన ఐకాన్ స్టార్! Wed, Dec 17, 2025, 01:59 PM
మళ్లీ డ్యుయెల్ రోల్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ Wed, Dec 17, 2025, 12:48 PM
500 మంది మహిళలకు ఉచిత క్యాన్సర్ చికిత్స అందించిన సోనూసూద్ Wed, Dec 17, 2025, 11:44 AM
రేపు ప్రభాస్ 'రాజాసాబ్' పాట విడుదల Wed, Dec 17, 2025, 10:45 AM
Peddi Movie: ‘చికిరీ చికిరీ’ సాంగ్ సెన్చురీ! మాస్ క్రేజ్ కాస్త అదిరిపోయింది Tue, Dec 16, 2025, 10:22 PM
Vrushabha: మోహన్ లాల్ అభిమానులు గుడ్ న్యూస్! రిలీజ్ డేట్ లాక్ అయింది Tue, Dec 16, 2025, 10:00 PM
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా.. ఇపుడు అదే హీరోతో హీరోయిన్‌గా Tue, Dec 16, 2025, 07:42 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ Tue, Dec 16, 2025, 06:56 PM
ఐఎండీబీ జాబితాలో కృతి సనన్ Tue, Dec 16, 2025, 06:54 PM
మరో మైల్ స్టోన్ చేరుకున్న రామ్ చ‌ర‌ణ్ ‘చికిరి చికిరి’ సాంగ్ Tue, Dec 16, 2025, 04:21 PM
సినిమాల్లో 'ఏ' సర్టిఫికేట్ కొత్త బ్రాండ్‌గా మారుతోందా? Tue, Dec 16, 2025, 04:17 PM
నేను ఎటువంటి ప్లాస్టిక్ సర్జరీ చేపించుకోలేదు Tue, Dec 16, 2025, 03:25 PM
‘కాంతార’ చిత్రం దైవానికి సంభందించిన అంశం Tue, Dec 16, 2025, 03:24 PM
గృహ హింస కేసులో భర్త నుండి రూ.100 కోట్ల పరిహారం కోరిన సెలినా జైట్లీ Tue, Dec 16, 2025, 03:23 PM
పెళ్లిపై వస్తున్న అసత్య ప్రచారాలపై స్పందించిన మెహరీన్ కౌర్ Tue, Dec 16, 2025, 03:12 PM
దర్శకుడు సుజిత్‌కు పవన్ కళ్యాణ్ రేంజ్ రోవర్ గిఫ్ట్ Tue, Dec 16, 2025, 02:04 PM
శరీర మార్పులపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందన: ఆరోపణలను ఖండించిన నటి Tue, Dec 16, 2025, 02:03 PM
అవతార్ 3 సినిమాతో పాటు.. 'రామాయణం' టీజర్‌ ప్రదర్శన Tue, Dec 16, 2025, 12:10 PM
థామా సినిమా ఇప్పుడు ఉచితంగానే చూడొచ్చు! Tue, Dec 16, 2025, 10:44 AM
ఉపాసనకు ప్రతిష్టాత్మక అవార్డు.. గర్వంతో మెగా అభిమానులు Tue, Dec 16, 2025, 10:36 AM
పెళ్లి వార్తలపై మెహరీన్ ఆగ్రహం Tue, Dec 16, 2025, 10:35 AM
సినిమా టికెట్ రేట్లు: శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం? Mon, Dec 15, 2025, 08:11 PM
మలయాళ నటికి అండగా నిలిచిన పృథ్వీరాజ్ Mon, Dec 15, 2025, 08:10 PM
న్యూ ఇయర్ స్పెషల్‌గా వెంకీ క్లాసికల్ హిట్ మూవీ రీరిలీజ్ Mon, Dec 15, 2025, 08:09 PM
వారణాసి మూవీలో మహేష్‌బాబు తండ్రిగా ప్రకాష్‌రాజ్? Mon, Dec 15, 2025, 03:42 PM
లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటి భాగ్యశ్రీ బోర్సే Mon, Dec 15, 2025, 03:25 PM
అవతార్ 3: థియేటర్లకు కామెరూన్ సూచనలు, హెచ్చరికలు Mon, Dec 15, 2025, 03:16 PM
ప్రముఖ దర్శకుడు, ఆయన భార్య దారుణ హత్య.. కుమారుడే హంతకుడు! Mon, Dec 15, 2025, 02:39 PM
లగ్జరీ కారు కొన్న శర్వానంద్.. ధర తెలిస్తే షాక్! Mon, Dec 15, 2025, 02:31 PM
'అఖండ 2' మూడు రోజుల్లోనే రూ.61 కోట్లు వసూలు Mon, Dec 15, 2025, 02:28 PM
బిగ్‌బాస్ సీజన్-9.. టాప్-5 కంటెస్టెంట్లు వీరే! Mon, Dec 15, 2025, 02:09 PM
ఒకరినిఒకరు నిందించుకోకుండా అందరం కలిసి నడవాలి Mon, Dec 15, 2025, 01:04 PM
కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న 'ధురంధర్' Mon, Dec 15, 2025, 12:59 PM
సూర్యతో నటించనున్న మమితా బైజు Mon, Dec 15, 2025, 12:58 PM
నిర్మాతగా ప్రియాంక చోప్రా Mon, Dec 15, 2025, 11:29 AM
ట్రోల్స్ పట్టించుకోను: అనిల్ రావిపూడి Mon, Dec 15, 2025, 11:20 AM
శ్రీకాంత్ ఓదెలకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ‘ది ప్యార‌డైజ్’ బృందం Sun, Dec 14, 2025, 04:32 PM
అందువల్లనే 'సైకో సిద్ధార్థ్' సినిమాను వాయిదా వేసాం Sun, Dec 14, 2025, 04:28 PM
హద్దులు దాటుతున్న తమిళ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు Sun, Dec 14, 2025, 04:26 PM
ఆధునిక హంగులతో 'మసక మసక చీకటిలో' ఆల్బమ్ Sun, Dec 14, 2025, 04:25 PM
ముంబై విమానాశ్రయంలో కెమెరాలకి చిక్కిన సమంత, రాజ్ నిడిమోరు దంపతులు Sun, Dec 14, 2025, 04:22 PM
‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర విడుదల తేదీని ప్రకటించిన చిత్రబృందం Sun, Dec 14, 2025, 04:21 PM
సినిమా టికెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండాలి Sun, Dec 14, 2025, 04:20 PM
'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం అవ్వడానికి కారణం నేనే Sun, Dec 14, 2025, 04:19 PM
‘అఖండ 2' చిత్రంపై ప్రశంసలు కురిపించిన ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ Sun, Dec 14, 2025, 04:18 PM
'రాజా సాబ్' సినిమా అనుకున్న తేదీకే వస్తుందన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతినిధులు Sun, Dec 14, 2025, 04:17 PM
రాజు వెడ్స్‌ రాంబాయి.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎందులో అంటే? Sat, Dec 13, 2025, 07:18 PM
పెళ్లి పీటలెక్కనున్న తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా? Sat, Dec 13, 2025, 07:16 PM
ఓటీటీలో 'చెరసాల' హారర్ మూవీ: అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ Sat, Dec 13, 2025, 04:04 PM
వెంకీ మామ కొత్త లుక్: సంక్రాంతికి ఫన్ గ్యారెంటీ! Sat, Dec 13, 2025, 03:57 PM
అఖండ 2: శివుడి పాత్రలో బాలీవుడ్ నటుడు తరుణ్ ఖన్నా - ప్రేక్షకుల ప్రశంసలు Sat, Dec 13, 2025, 01:52 PM
వృద్ధాశ్రమంలో పాకీజా, ఆదుకోవాలని వేడుక Sat, Dec 13, 2025, 11:36 AM
చైతూతో వైవాహిక జీవితంపై శోభితా ఎమోషనల్ Sat, Dec 13, 2025, 10:48 AM
ట్రోల్స్ నాకు ఎనర్జీ ఇచ్చాయి: ప్రభాస్ సినిమాపై దర్శకుడు మారుతి Sat, Dec 13, 2025, 10:47 AM
‘నరసింహ’ చిత్రానికి సీక్వెల్‌ వస్తదంటున్న రజనీకాంత్ Sat, Dec 13, 2025, 10:15 AM
హిందీ బిగ్‌బాస్ లో విజేతగా నిలిచిన గౌరవ్ ఖన్నా Sat, Dec 13, 2025, 10:14 AM
రోహిత్ శర్మతో కలిసి యాడ్ లో నటించిన అల్లు శిరీష్‌ Sat, Dec 13, 2025, 10:13 AM
నవ్వించడమే లక్ష్యంగా ‘పురుష' Sat, Dec 13, 2025, 10:11 AM
జనవరి 2న విడుదల కానున్న 'ఘంటసాల ది గ్రేట్' Sat, Dec 13, 2025, 10:09 AM
'ఛూ మంతర్' చిత్రంలో శ్రీలీల Sat, Dec 13, 2025, 10:08 AM
నాపై వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారు Sat, Dec 13, 2025, 10:07 AM
జనవరి 9న తప్పకుండా వస్తామంటున్న 'ది రాజా సాబ్' Sat, Dec 13, 2025, 10:06 AM
నేడు తెలుగు ఛానళ్లలో ప్రదర్శన కాబోయే చిత్రాలివే Sat, Dec 13, 2025, 10:06 AM
'శ్రీనివాస మంగాపురం' పేరుతో రానున్న జయకృష్ణ ఘట్టమనేని Sat, Dec 13, 2025, 10:05 AM
జూన్ 26, 2026న విడుదల కానున్న సూప‌ర్ గ‌ర్ల్ Sat, Dec 13, 2025, 10:04 AM
'అఖండ -2'తో వెనక్కితగ్గిన 'మిస్ స్టీరియస్' Sat, Dec 13, 2025, 10:03 AM
నా విజయం ఇండస్ట్రీలో మహిళలకు అంకితమిస్తున్నా Sat, Dec 13, 2025, 10:01 AM
భారీ బడ్జెట్ చిత్రాలతో దూసుకుపోతున్న ప్రభాస్ Sat, Dec 13, 2025, 09:59 AM
'అంబారీ' నవలపై ప్రశంసలు కురిపించిన కృష్ణవంశీ Sat, Dec 13, 2025, 09:59 AM
'దురంధర్' చిత్రంపై కీలక వ్యాఖ్యలు చేసిన నిర్మాత నాగ వంశీ Sat, Dec 13, 2025, 09:58 AM