|
|
by Suryaa Desk | Thu, Oct 02, 2025, 05:51 PM
పెంపుడు జంతువులతో విమాన ప్రయాణాలు చేసే వారి పట్ల ఎయిర్ ఇండియా వ్యవహరిస్తున్న తీరుపై ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాణికులను, వారి పెంపుడు జంతువులను ఎయిర్ ఇండియా ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఈ విషయంలో కొత్తగా వచ్చిన ఆకాశ ఎయిర్‌ను చూసి నేర్చుకోవాలని ఎయిర్ ఇండియాకు ఆమె సూచించారు.విమానాల్లో పెంపుడు జంతువుల ప్రయాణానికి సంబంధించి ఆకాశ ఎయిర్ ప్రవేశపెట్టిన కొత్త విధానాన్ని ప్రశంసిస్తూ వచ్చిన ఓ కథనాన్ని రవీనా తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్ ఇండియాను ట్యాగ్ చేస్తూ ఘాటుగా స్పందించారు. "ఎయిర్ ఇండియా, కాస్త చూసి నేర్చుకోండి. కొన్నిసార్లు మీరు పెంపుడు జంతువుల యజమానులను చాలా ఇబ్బందులకు గురి చేస్తుంటారు. మీరు విమానంలోకి ఎక్కించుకునే కొందరు మనుషుల కంటే మా పెంపుడు జంతువులే చాలా మంచిగా ప్రవర్తిస్తాయి" అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.
Latest News