ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 12:44 PM
నకిరేకల్ వాసవి కళాశాలలో లిటిల్ సోల్జర్స్, వాసవి సేవా సమితి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత స్టడీ హాల్ 1000 రోజులు పూర్తి చేసుకుంది. నిరుద్యోగులకు అండగా ఉండాలనే లక్ష్యంతో ఫిబ్రవరి 1, 2023న ప్రారంభమైన ఈ స్టడీ హాల్‌లో 500 మందికి పైగా ఉద్యోగార్థులు చదువుకున్నారు. డీఎస్సీ, గురుకులాలు, పోలీస్, గ్రూప్ 4, నర్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్ వంటి పోటీ పరీక్షలలో 30 మందికి పైగా అభ్యర్థులు ఉద్యోగాలు సాధించడం నిర్వాహకులకు సంతోషాన్నిచ్చింది. పురుషులు, మహిళలకు వేర్వేరు గదులతో ఎటువంటి ఫీజు లేకుండా నిర్వహిస్తున్న ఈ స్టడీ హాల్ భవిష్యత్తులోనూ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.