|
|
by Suryaa Desk | Sat, Oct 25, 2025, 11:51 AM
కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దుర్ఘటన నేపథ్యంలో, బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీవో అధికారులు శనివారం గగన్ పహాడ్ వద్ద తనిఖీలు చేపట్టారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉపాసిని ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలలో, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 3 బస్సులపై కేసులు నమోదు చేసి సీజ్ చేశారు. రెండు బస్సులలో స్లీపింగ్ సీట్లను స్లీపర్ సీట్లుగా మార్చడం, జగన్ ట్రావెల్స్ బస్సులో డ్యూయల్ హారన్ ఏర్పాటు చేయడం వంటి ఉల్లంఘనలు గుర్తించారు. డ్రైవర్, స్ప్రేర్ డ్రైవర్ లతో పాటు కనీస జాగ్రత్తలు, డాక్యుమెంట్ల పరిశీలన కూడా జరిగింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఏఎంవిఐ ఉపాసిని హెచ్చరించారు.