|
|
by Suryaa Desk | Sat, Oct 18, 2025, 11:56 AM
TG: సింగరేణి యాజమాన్యం అర్హత కలిగిన కార్మికుల బ్యాంకు ఖాతాల్లో పనితీరు ఆధారిత రివార్డు (పీఎల్ఆర్) పథకం కింద రూ.1.03 లక్షల చొప్పున దీపావళి బోనస్‌ను జమ చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపరితల గనుల్లో కనీసం 240 రోజులు, భూగర్భ గనుల్లో 190 రోజులు పనిచేసిన కార్మికులకు ఈ బోనస్ వర్తిస్తుంది. పండుగ ముందు ఈ భారీ బోనస్ తో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.