|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 12:09 PM
దేవి శరన్నవరాత్రుల సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి సోమవారం భక్తులకు బాలాత్రిపుర సుందరి దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు నగర నలుమూలల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. దుర్గమమైన అడవుల్లో...బండరాళ్ల మధ్య కొద్దిరోజులు సేదతీరింది. అదే...జూబ్లీహిల్స్‌లో ప్రస్తుతం పెద్దమ్మ దేవస్థానమున్న ప్రాంతమని స్థానిక ఐతిహ్యం. ‘పెద్దమ్మ’ అన్న మాట ఏ పురాణాల్లోనూ కనిపించదు. ఏ స్తోత్రాల్లోనూ వినిపించదు. ముగ్గురమ్మల మూలపుటమ్మే.. కడు పెద్దమ్మ! ఏడు ఎకరాల ఆవరణలో విస్తరించిన ఆధ్యాత్మిక క్షేత్రం...జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి గుడి! హైదరాబాద్ నాలుగు వందల సంవత్సరాల ప్రాచీన నగరం. భాగ్యనగర నిర్మాణానికి చాలా చాలా ముందే ...ఆమాటకొస్తే, వేల సంవత్సరాల క్రితమే జూబ్లీహిల్స్ ఆదిమతెగలకు ఆవాసంగా ఉండేదంటారు. వేటే జీవనంగా బతికే ఆ అమాయకులు తమ కులదేవత పెద్దమ్మ తల్లిని భక్తితో కొలిచేవారు.మంచి జరిగితే, నైవేద్యాలిచ్చి అమ్మ సమక్షంలో సంబరాలు జరుపుకునేవారు.