|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 11:45 AM
ఓడీఎఫ్ కాలనీ లో ఎంగిలి పూవు బతుకమ్మ వేడుకల్లో బీఆర్ స్ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి శ్రీ కాట సునీత రాజేష్ గౌడ్ గారు పాల్గొన్నారు. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఓడీఎఫ్ కాలనీ ప్రాంగణంలో ఘనంగా జరిగిన వేడుకలో సునీతమ్మ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదటి రోజు ఎంగిలి పూవు బతుకమ్మ సందర్భంగా కాలనీ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు…తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో ఎంగిలి పూవు బతుకమ్మకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది.తెలంగాణలో మహిళలందరూ పూలతో మాత్రమే జరుపుకునే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేలా చేసి, రాష్ట్ర గౌరవంగా నిలిపిన ఘనత గతంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ప్రభుత్వానికి దక్కింది అని వారు గుర్తు చేశారు.