|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 04:14 PM
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి సీతక్క తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో పర్యటించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని అన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా సరఫరా బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, ఈ విషయంలో రైతులను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని ఆమె అన్నారు.