|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 03:28 PM
రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, తన సతీమణి మనాలి ఠాకూర్ తో కలిసి గురువారం పాలకుర్తి మండలం బసంత్ నగర్ లోని వర్కర్స్ క్లబ్ ఆవరణలో మక్కాన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పరిసర గ్రామాల ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.