|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 12:34 PM
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రపంచమంతా సమర్థిస్తోందని, భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా ప్రయాణిస్తోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్‌లోని చెరువు కట్ట బతుకమ్మ ఘాట్ వద్ద గురువారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. మోడీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందిందని, ఆయన ఆలోచన విధానాన్ని అందరికీ తెలియజేసేలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్ కూడా పాల్గొన్నారు.