|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 07:10 PM
తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణలో ప్రభుత్వం అలైన్‌మెంట్ మార్పు వల్ల ఇబ్బందులు పడుతున్న వికారాబాద్ రైతులను ఆదుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను వికారాబాద్ రైతులు కలిశారు.వికారాబాద్‌కు చెందిన రైతులు మాట్లాడుతూ, ప్రభుత్వం భూసేకరణ చేసేటప్పుడు ఎందుకు తీసుకుంటున్నారో చాలా స్పష్టంగా చెప్పాలని, ఎంత తీసుకుంటున్నారో కూడా స్పష్టంగా చర్చించి చెప్పాలని అన్నారు.చట్టప్రకారం వ్యవహరించాలని, ప్రభుత్వం ఇష్టానుసారంగా భూములు లాక్కుంటామంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.కచ్చితంగా భూసేకరణ చట్టం ప్రకారం భూమి సేకరణకు సంబంధించిన లక్ష్యాలు ఉండాలని, అవసరమైతే భూములను కోల్పోతున్న ప్రతి రైతుకు పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ భూములను వదిలి తమ భూములను కాపాడుకునేందుకు, ఇతర ప్రైవేట్ వ్యక్తుల భూములను ఇబ్బంది పెట్టేలా భూసేకరణ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.గతంలో కూడా ఔటర్ రింగ్ రోడ్ అంశంలో ఇదే విధంగా సొంత అజెండాలతో ముందుకు వెళ్లిందని, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణలో కూడా…. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒరిజినల్ అలైన్‌మెంట్ కాకుండా సొంత డబ్బులతో కడుతున్నామని చెప్పి తమవారి భూములను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తోందని అన్నారు.అందుకోసం వేలాదిమంది రైతుల జీవితాలను దెబ్బతీస్తోందని విమర్శించారు.