|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 02:46 PM
TG: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం బల్సుపల్లి గ్రామానికి చెందిన నాగరాజుకు వైద్యుల నిర్లక్ష్యం ఎదురైంది. జ్వరంతో దేవరకద్ర ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఆయనకు మొదటి రోజు జ్వరం సూది ఇచ్చారు. అయితే రెండో రోజు ఏఎన్‌ఎం పొరపాటున కుక్కకాటు నివారణ రేబిస్ టీకా వేశారు. అనంతరం తప్పును గ్రహించి వివరించడంతో బాధితుడు వైద్యులను నిలదీశారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు రావని, పర్యవేక్షణ కోసం ఆశా వర్కర్‌ను అందుబాటులో ఉంచుతామని వైద్యులు తెలిపారు.