|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 01:50 PM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు. బుధవారం కట్టంగూర్ మండలంలోని ఇస్మాయిల్ పల్లి గ్రామానికి చెందిన అలుగుబెల్లి శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సంపత్ రెడ్డి, పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే వేముల వీరేశం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.