|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 02:46 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఐడిపిఎల్‌లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చింతల్ నగర శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 8200 కోట్ల స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా కన్వీనర్ మృత్యుంజయం మాట్లాడుతూ, స్కాలర్‌షిప్‌లు విద్యార్థుల హక్కు అని, ప్రభుత్వం వేసే బిక్ష కాదని అన్నారు.