|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 08:13 PM
తెలంగాణ ప్రభుత్వంతో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు చర్చలు జరుపుతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుతో సుదీర్ఘంగా చర్చలు సాగుతున్నాయి. భారీగా ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు పేరుకుపోయాయని, విద్యాసంస్థలను నడపటం చాలా కష్టంగా ఉందని కాలేజీ యాజమాన్యాలు వివరిస్తున్నాయి. ప్రభుత్వంపై భారం పడకుండా నిధులు ఎంత మేరకు విడుదల చేయాలి? సాధ్యాసాధ్యాలపై చర్చ జరుగుతోంది. కాసేపట్లోనే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.