ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 11:08 AM
హైదరాబాద్‌లోని నాగోల్ ప్రాంతంలో కట్నం వేధింపులకు సంబంధించి ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. అదనపు కట్నం కోసం భార్యపై దాడి చేసి గొంతు కోసి చంపేందుకు యత్నించాడు భర్త వేణుగోపాల్. బాధితురాలు సుమతిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 20 లక్షలు కట్నం ఇచ్చి వివాహం చేసినప్పటికీ, వేణుగోపాల్ కొంతకాలంగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని బాధితురాలి బంధువులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడు వేణుగోపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు.