|
|
by Suryaa Desk | Sun, Sep 14, 2025, 07:21 PM
హైదరాబాద్ నగరంలో ఈ సాయంత్రం నుండి వర్షాలు ప్రారంభమయ్యాయి. దాదాపుగా బోడుప్పల్, మేడిపల్లి, ఉప్పల్, రామంతాపూర్, అల్వాల్, సుచిత్ర, కొంపల్లి, హయత్ నగర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో వాన కురుస్తోంది. అకస్మాత్తుగా మొదలైన ఈ వర్షంతో రోడ్లపై ట్రాఫిక్ తీవ్రంగా పెరిగింది.
వాతావరణ శాఖ నివేదికల ప్రకారం, నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా రాబోయే కొన్ని గంటల్లో వర్షం విస్తరించే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతల పడిపోవడంతో వాతావరణం చల్లబడింది. కొన్నిచోట్ల తేలికపాటి వానగా మొదలైనప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది.
వర్షాలు పడి రావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నీటి నిలిచే ప్రమాదం ఉండటంతో, ప్రజలు అవసరమైతే మాత్రమే బయటకు రావాలని సూచిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడ నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా మేడక్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో వర్షపాతం నమోదవుతున్నట్లు సమాచారం. రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.