ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Sun, Aug 24, 2025, 12:07 PM
మేడిపల్లిలో ఇటీవల జరిగిన మహిళ స్వాతి హత్య కేసులో నిందితుడు ఆమె భర్త మహేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తనే హత్య చేసినట్లు మహేందర్ ఒప్పుకున్నాడని సమాచారం. పోలీసుల చెబుతున్న ప్రకారం, మహేందర్ రెడ్డి తన భార్యను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ప్రతాప్‌సింగారం వద్ద మూసీ నదిలో పారేశానని వెల్లడించాడు.ఈ నేపథ్యంలో పోలీసులు మరియు DRF క్లూస్ టీమ్ కలసి ప్రతాప్‌సింగారం మూసీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహ అవశేషాల కోసం విస్తృతంగా సోదాలు కొనసాగుతున్నాయి.