|
|
by Suryaa Desk | Sat, Aug 02, 2025, 01:51 PM
కాంగ్రెస్ పార్టీ బీసీల పేరుతో రాజకీయం చేయాలని చూస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ ఎప్పుడైనా బీసీ నేతను సీఎంను చేసిందా అని ప్రశ్నించారు. బీసీలకు ఎక్కడ ప్రాధాన్యమిచ్చారని రామచందర్‌రావు నిలదీశారు. తొమ్మిది మంది కార్పొరేషన్ చైర్మన్లలో ఒక్క బీసీ నేతకు మాత్రమే అవకాశమిచ్చారని, కేవలం ముగ్గురు బీసీ మంత్రులు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు.