|
|
by Suryaa Desk | Fri, Aug 01, 2025, 10:39 AM
వలస కార్మికుడి ప్రాణం తీసిన 100 రూపాయల గొడవ. వంద రూపాయల గొడవలో వినోద్ అనే వ్యక్తి తలపై ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేసిన మరో వ్యక్తి . పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ పోలీసు స్టేషన్ పరిధిలో భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మహారాష్ట్ర రాష్ట్రం చంద్రాపూర్ జిల్లా జాట్లాపూర్ గ్రామానికి చెందిన వినోద్ బాబాజీ సొస్కరి(44). బుధవారం రాత్రి తనతో ఉన్న మనోజ్ అనే వ్యక్తి నీలకంఠ అనే మరో వ్యక్తికి రూ.300 అప్పుగా ఇవ్వగా, రూ.200 మాత్రమే తిరిగిచ్చి మిగతావి తరువాత ఇస్తానని చెప్పిన నీలకంఠ . ఈ విషయంలో ఇద్దరు గొడవ పడుతుండగా, గొడవ పడకుండా బయటికి వెళ్లమని చెప్పిన వినోద్. తనను బయటకి వెళ్లమన్నాడనే కోపంతో నిద్రిస్తున్న సమయంలో వినోద్ తలపై ఇనుప రాడ్డుతో కొట్టి చంపిన మనోజ్. ఉదయం ఎంతకీ నిద్రలేవకపోవడంతో అతని వద్దకు వెళ్లి చూడగా రక్తపు మడుగుల్లో కనిపించిన వినోద్‌ను ఆసుపత్రికి తరలించిన తోటి కార్మికులు. వైద్య పరీక్షలు చేసి అప్పటికే మృతి చెందాడని నిర్ధారించిన వైద్యులు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు