|
|
by Suryaa Desk | Fri, Aug 01, 2025, 10:34 AM
అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను కేంద్ర గృహా నిర్మాణ, పట్టన వ్యవహారల మంత్రిత్వ శాఖ ( ఎంఓహెచ్‌యూఏ)కు చెందిన అధికారుల బృందం గురువారం సందర్శించింది. చెరువు చుట్టూ తిరుగుతూ.. అభివృద్ధిని దశలవారీ తెలుసుకుంది. ఒకప్పుడు చెత్త, నిర్మాణ వ్యర్థాలతో నిండిన ప్రాంతం చెరువులా రూపాంతరం చెందడాన్నిపాత చిత్రాలను చూసి ఆశ్చర్యపోయింది. చెరువుల పరిరక్షణకు జాతీయ స్థాయిలో బతుకమ్మ కుంట ఒక నమూనా అవుతుందని బృందానికి నాయకత్వం వహించిన కేంద్ర గృహా నిర్మాణం, పట్టన వ్యవహారల మంత్రిత్వ శాఖ అడిషనల్ చీఫ్ టౌన్ ప్లానర్ మోనీస్ ఖాన్ పేర్కొన్నారు. కబ్జాల చెర నుంచి విముక్తి కల్పించడం.., మండు వేసవిలో రెండు మీటర్ల లోతు తవ్వగానే గంగమ్మ తల్లి ఉబికి వచ్చే వీడియోలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హైడ్రా పనితీరు గురించి వార్తల్లో చదివాం.. నేడు క్షేత్రస్థాయిలో తెలుసుకున్నామని చెప్పారు. హైడ్రా కృషిని అభినందించారు. చెరువు చుట్టూ ఇంకా అభివృద్ధి చేయాల్సిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. చెరువు అభివృద్ధితో ఇక్కడి ప్రాంతం సుందరంగా తయారవ్వడమే కాకుండా.. ఇక్కడ భూముల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని అన్నారు. హైడ్రా
వరద నీరు వచ్చేలా ఎలా..?
చెరువుకు ఆనుకుని సాగే మురుగు కాలువలోంచి వరద నీరు మాత్రమే వచ్చేలా ఇన్‌లెట్‌ను నిర్మించడాన్ని చూసి కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందం ముచ్చట పడింది. ఇటీవల కురిసిన వర్షాల సమయంలో వరద నీరు ఎలా వచ్చి చేరిందో వీడియాల ద్వారా హైడ్రా అధికారులు కేంద్ర బృందానికి చూపించారు. ఈ వరద నీరు గతంలో ఎటు వెళ్లేదని.. స్థానికులతో కూడా మాట్లాడి ఈ బృందం తెలుసుకుంది. వరద నీరు తమ బస్తీలను, కాలనీలను ముంచెత్తేది.. ఈ సారి ఆ వరద చెరువుకు చేరిందని చెప్పడంతో మరింత లోతుగా అధ్యయనం చేయడం ప్రారంభించింది. చెరువు ఔట్‌లెట్లను కూడా పరిశీలించింది. కేంద్ర గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ అసోసియేట్ టౌన్ ప్లానర్ సందీప్ రావుతో పాటు.. హైడ్రా అధికారులు మోహనరావు, బాలగోపాల్, చెరువులను అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న విమోస్ టెక్నోక్రాట్ ఎండీ పి. యూనస్, జీహెచ్ ఎంసీ అడిషనల్ చీఫ్ సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, సిటీ ప్లానర్ ఉమాదేవి తదితరులు కేంద్ర బృందంతో ఉన్నారు.