|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 12:34 PM
పటాన్చెరు : పటాన్చెరు పరిధిలోని పరేక్ ప్లాస్ట్ పరిశ్రమ కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం చేయడం జరిగిందని పరేక్ ప్లాస్ట్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు, స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి లోని కార్మిక శాఖ కార్యాలయంలో డీసీఎల్ రవీందర్ రెడ్డి సమక్షంలో పరిశ్రమ యాజమాన్యం తరపున సమీర్ కులకర్ణి, కార్మిక సంఘం తరఫున యూనియన్ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ ల మధ్య వేతన ఒప్పందంపై చర్చలు జరిగాయని తెలిపారు. మెరుగైన వేతన ఒప్పందం అందిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.వేతన ఒప్పందంలో ప్రధానంగా.. రాబోయే మూడు సంవత్సరాలకు గాను ప్రస్తుతం అందుకుంటున్నా వేతనానికి అదనంగా ప్రతి కార్మికుడు రాబోయే మూడు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం 4000 రూపాయల చొప్పున మొత్తం 12,000 వేల వేతనం జరిగిందని తెలిపారు. ప్రతి దసరా పండగకి 2500 రూపాయల యాన్యువల్ డే గిఫ్ట్ తో పాటు, బోనస్, ఇతర సౌకర్యాలు లభిస్తాయని తెలిపారు. తమ సంఘంపై కార్మికుల పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మెరుగైన వేతన ఒప్పందం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లోనూ కార్మికుల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. మెరుగైన వేతన ఒప్పందం చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ ను.. పరిశ్రమ కార్మికులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం ప్రతినిధులు సతీష్, బాల రాజు, రాజు, మంగ రావు, వినోద్, సత్యనారాయణ, శ్రీకాంత్, బాల్ రెడ్డి, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.