|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 12:57 PM
ఈరోజు గచ్చిబౌలి డివిజన్,గోపనపల్లి గ్రామంలో జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి బలిదాన్ దివాస్ సందర్భంగా గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు ఇతర బీజేపీ నాయకులతో కలిసి వారి చిత్రపటానికి నివాళులర్పించి ,మొక్కలు నాటిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్,.ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారని , నెహ్రూ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఆర్టికల్ 370 చట్టాన్ని వ్యతిరేకిస్తూ , కేంద్రమంత్రి పదవి కి రాజీనామా చేసి జనసంఘ్ ను స్థాపించి దేశంలో ఒకే రాజ్యాంగం ,ఒకే ప్రధాని, ఒకే చట్టం ఉండాలని ఆశించిన గొప్ప జాతీయవాదని, వారి స్పూర్తి తోనే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆర్టికల్ 370, 35 -ఏ రద్దు చేయటం జరిగిందని గుర్తుచేశారు,దేశ సమగ్రతను, ఐక్యతను కాపాడేందుకు వారి చేసిన పోరాటం ప్రతి భారతీయుడికి ప్రేరణాత్మకం, విలువలు కోసం కట్టుబడిన వారి జీవితం మనకు స్ఫూర్తిదాయం అని అన్నారు, ఈ కార్యక్రమంలో తిరుపతి, రంగస్వామి, మురళి, క్రాంతి కుమార్, రమేష్, జీవా, శ్రీను, సురేష్ మరియు కార్యకర్తలు మొదలగు వారు పాల్గొన్నారు.