|
|
by Suryaa Desk | Sun, Jun 22, 2025, 02:26 PM
ఆదివారం విద్యానగర్ నివాసంలో ఆర్. కృష్ణయ్యతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీల కోసం కవిత ముందుకొచ్చి మాట్లాడుతున్నారు.. ఫైట్ చేస్తున్నారని కొనియాడారు. బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు ఆమెకు మద్దతు ఇవ్వాలని కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. బీసీలకు 75 ఏళ్లుగా అన్యాయం జరుగుతోందని, వాస్తప పరిస్థితిని అర్ధం చేసుకొని కమిట్మెంట్‌తో పోరాటం చేయకపోతే చాలా ప్రమాదం ఉంది. ఇప్పుడున్న రిజర్వేషన్లు కూడా తగ్గుతాయని హాట్ కామెంట్స్ చేశారు. బీసీ కాకపోయినా కవిత మన కోసం పోరాటం ప్రారంభించారు.. అందరం ఐక్యంగా ఉద్యమం చేస్తేనే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయని చెప్పారు. జూలై 17న జరిగే జాగృతి రైల్ రోకోకు కచ్చితంగా మద్దతు ఇస్తామని ఎమ్మెల్సీ కవితకు ఆర్.కృష్ణయ్య హామీ ఇచ్చారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు చేస్తేనే స్థానిక ఎన్నికలు: కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని, బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉందన్నారు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాం.. కానీ కేంద్రం ఆమోదించాలని చెబుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజా ఉద్యమాలే శరణ్యమని తెలిపారు. అందుకోసమే ఆర్ కృష్ణయ్య మద్దతు కోరడానికి వచ్చామని కీలక వ్యాఖ్యలు చేశారు.