|
|
by Suryaa Desk | Sun, Jun 22, 2025, 02:21 PM
ఓ మైనర్ అమ్మాయితో చిన్ననాటి నుండి స్నేహం పేరుతో దగ్గరై ఆమెతో సెల్ ఫోన్ లో చాటింగ్ చేసి చివరికి ఆమెని బెదిరించి నగ్న వీడియో కాల్ చేయించి, ఆ వీడియో కాల్ ను తన మిత్రులకు పంపించి రాక్షస ఆనందం పొందాడు ఓ మైనర్ బాలుడు. ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన ఓ మైనర్ బాలుడు, మైనర్ బాలికతో స్నేహం పెంచుకుని ఆమెతో సెల్ ఫోన్ లో చాటింగ్ చేశాడు. మైనర్ అమ్మాయితో చేసిన చాటింగ్ ను అమ్మాయి తల్లిదండ్రులకు, బయటి ప్రజలకు తెలుపుతానని బెదిరించి అమ్మాయితో నగ్న వీడియో కాల్ చేయించాడు. అంతటితో ఆగకుండా దాన్ని రికార్డ్ చేసి తన ఎనిమిది మంది మిత్రులకు పంపించాడు. అది చూసిన వారు ఆ అమ్మాయిని లైంగికంగా, మానసికంగా వేధించడంతో మైనర్ బాలిక ఆదిలాబాద్ షీ టీంను ఆశ్రయించింది. షీ టీం సహాయంతో ఇచ్చోడ సీఐ బండారి రాజు ఆధ్వర్యంలో సజ్జన్వార్ వంశీ, పవర్ తరుణ్, సాబ్లే బాలవంత్ సింగ్, గుండలావార్ వరుణ్, కరాడ్ సుధీర్, ముర్కుటే విట్టల్, ఇద్దరు మైనర్ నిందితులను అదుపులోకి తిసుకొని బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లో ఎనిమిది మంది నిందితుల పై ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. ఆదిలాబాద్ షి టీం ఎల్లవేళలా మహిళలకు అండగా ఉంటుందని మహిళలు భయపడకుండా ఎలాంటి అత్యవసర సమయంలోనైనా షీ టీం ఆదిలాబాద్ 8712659953 కు కాల్ చేయాలన్నారు. పిల్లల తల్లిదండ్రులు పిల్లలు చేసే పనులను గమనిస్తూ వారి పై శ్రద్ధ చూపాలని కాజల్ సింగ్ అన్నారు.