|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 03:53 PM
ఎంపీ ఈటల రాజేందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తనపై వస్తున్న ఆరోపణలు నిజం నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. కావాలనే తనపై బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం విచారణ త్వరగా ముగ్గుస్తుందన్న నమ్మకం తనకు లేదని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని వెల్లడించారు. మీ డిపార్ట్మెంటో ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా.. కేబినెట్ లో పెట్టండి అని కేసీఆర్ చెప్పే వారు ఇది నిజం కాదంటే నేను దేనికైనా సిద్ధం అని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మించడం, అవినీతి వేరువేరుగా చూడాలి.. ప్రాజెక్ట్ నిర్మించాలి కానీ వాటిని అడ్డం పెట్టుకొని సంపాదించడాన్ని మా పార్టీ వ్యతిరేకిస్తుందని బీజేపీ ఎంపీ ఈటల చెప్పారు.ఇక, తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగింది అని ఈటల రాజేందర్ తెలిపారు. నేను జైళ్లకు పోయిన, నా రక్తం చిందిది, పెట్రోల్ మంటల్లో యువత కాలిపోయింది, ఫలితంగా వచ్చిన తెలంగాణలో ప్రాజెక్ట్ కట్టాలా వద్దా? అని ప్రశ్నించారు. అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే మొదలు పెట్టారు కానీ పూర్తిచేయలేదు..