|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 08:39 PM
నిజాంసాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువ ద్వారా బుధవారం నీటి పారుదల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ నుంచి 1,200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్ట్ ఏఈ శివకుమార్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్ట్లో 6.03 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. నిజామాబాద్, బోధన్ పట్టణ ప్రజలకు తాగునీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేశామని, ప్రజలు, పశువుల కాపరులు ప్రధాన కాలువలోకి వెళ్లవద్దన్నా. ప్రధాన కాలువ తూములు తెరవడం నిషిద్ధమని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన సూచించారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ తక్కువగా ఉన్నందున నీటిని వృధా చేయకుండా నీటిని పొదుపుగా వినియోగించుకోవాలన్నారు. ప్రాజెక్టు పూర్తి సాయి నీటి మట్టం 1405.00 అడుగులు, 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1393.78 అడుగుల 6.032టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.రు.