|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 08:43 PM
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీకి బీఆర్ఎస్ వర్కిగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. ఈ కేసులో ఏసీబీ కేటీఆర్‌ను ఫార్ములా ఈ కార్ రేస్ సమయంలో వినియోగించిన ఫోన్లు సమర్పించాలన్నదానికి లేఖ ద్వారా సమాధానమిచ్చారు. '2024లో ఫోన్లు మార్చాను. గతంలో వాడిన ఫోన్లు నా దగ్గర లేవు. ఫోన్లు అడగటం అంటే వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే' అని రాసుకొచ్చారు. కాగా 2021 నవంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు వాడిన ఫోన్లు కావాలని ఏసీబీ కోరింది.ఏసీబీ అధికారుల ఆదేశాలపై కేటీఆర్ తన న్యాయవాదులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మొబైల్ ఫోన్‌ను గానీ, ల్యాప్‌టాప్‌ను గానీ ఏసీబీకి అప్పగించాల్సిన అవసరం లేదని న్యాయనిపుణులు కేటీఆర్‌కు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ న్యాయ సలహా మేరకే కేటీఆర్ ఏసీబీకి లేఖ ద్వారా తన నిర్ణయాన్ని తెలియజేశారు.